WhatsApp Image 2024 01 16 at 11.15.27 AM
అయోధ్యలోని రామమందిరప్రతిష్ఠా ముహూర్తoను నిర్ణయించినది వీరే. పండిత్ గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ అనే పేరు కలిగి కాశీ పట్టణమందు నివసిస్తున్నారు.
కాశీయందలి రామ్ ఘాట్ వద్ద గంగానదీ తీరాన ఈయన నివాసం. Simple living & high thinking కి ప్రతిరూపమే ఈయన. కంచికామకోటి పీఠాధిపతులు చాతుర్మాస్యం కాశీలో చేస్తూ 2023 ఆగస్ట్ మొదటివారంలో వార్షిక పంచాంగసదస్సు నిర్వహించి, చివరిరోజున జ్యోతిషసభ నిర్వహించారు. ఆ సందర్భంలో ఈయనను చూడటం, కలవడం జరిగింది. ఇంట్లో ఉన్నపుడు ఎవరైనా ఎంత సింపుల్ డ్రస్ లో ఉంటారో, సభకు కూడా అంతే సింపుల్ డ్రస్ లో రావడం.. పైగా సామాన్యుడు లా నడుచుకుంటూ రావడం నన్ను ఆశ్చర్యపరిచాయి. ఈయన సూర్యసిద్ధాంత పంచాంగాన్నే అనుసరిస్తారు. ముహూర్తo దొరకడం కష్టంగా ఉన్నపుడు, ఈయన చాలా తేలికగా ముహూర్త నిర్ణయం చేస్తారని కాశీలోని పండితులు చెబుతూ ఉంటారు. మహానుభావులు వారు(సేకరణ)
