జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 21 at 11.29.48 AM

TRINETHRAM NEWS

IT Raids: హైదరాబాద్‌, ప్రొద్దుటూరులో ఐటీ సోదాలు

ప్రొద్దుటూరు హైదరాబాద్‌తో పాటు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కేసీ పుల్లయ్య అనే వ్యక్తి నివాసం, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు..

కేసీ పుల్లయ్య కుమారుడు అనిల్ తెలుగు రాష్ట్రాల్లో భారీ మొత్తంలో కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. ప్రొద్దుటూరులోని కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులు కూడా కేసీ సంస్థే చేపడుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని కేసీ పుల్లయ్య సంస్థల్లోనూ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఎక్కడెక్కడ కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారన్న విషయాలపై ఆరా తీస్తున్నారు..

You cannot copy content of this page