ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనేతరులకు పక్కా గృహాలు మంజూరు చేయాలని, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి మాట్లాడడం చూస్తే గిరిజన చట్టాలపై ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడడమేనని సిపిఐ మండల కార్యదర్శి ఇరవాడ దేముడు విమర్శించారు. శనివారం విలేకరులకు విడుదల చేసిన ప్రకటనలో దేవుడు మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధ మైన పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గిరిజనుల గుండెకాయ లాంటి 1/70 చట్టాన్ని సవరించాలని చేసిన వ్యాఖ్యలు తెలిసిందేనని, అన్నారు.
ఇది ఇలా ఉండగా తొమ్మిది నెలల కూటమి పాలనలో రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవి అసెంబ్లీలో మాట్లాడుతూ గిరిజనేతరులకు,పక్క గృహాలు మంజూరు చేయాలని మాట్లాడడం అవివేకమని ఆయన అన్నారు. గిరిజన చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించుకొని మాట్లాడాలని ఆయన హితవు ఫలితాలు. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలంటే ఏ చట్టం అడ్డు రాదని ప్రతి గ్రామంలో రహదారులు, మంచినీటి సౌకర్యాలు కల్పించవచ్చని ఆయన అన్నారు.
గిరిజనులు, గిరిజనేతరులు అనేక సంవత్సరాలుగా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉన్నారని అలాంటివారు మధ్య చిచ్చు పెట్టడం గిరిజనులకు బాధ కలిగించిందని,ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గిరిజన ప్రాంతం సస్యశ్యామలయ్యే విధంగా అభివృద్ధి చేయాలని, అంతేకానీ గిరిజనులకు హాని కలిగించే విధంగా మాట్లాడడం మానుకోవాలని ఆయన మీడియా ముందు తన ఆవేదన వ్యక్తపరిచారు.ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సమైక్య అధ్యక్షులు దర్శి సతీష్, మాజీ సర్పంచ్ గుమ్మా రాంబాబు, గిరిజన సమైక్య మండల అధ్యక్షులు పోట్టుకూరి మల్లేశ్వరరావు,మాజీ వైస్ సర్పంచ్ ఇరువాడ రాజబాబు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


