administration is Very Good : పరిపాలన చాలా బాగుంది

TRINETHRAM NEWS
administration is very good

administration is Very Good : ఎన్టీఆర్ జిల్లా : మార్చి 16 : (త్రినేత్రం న్యూస్); తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం , నరసాపురం గ్రామ కార్యదర్శి ఎన్ రజిని ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం చాలా బాగుంది అని అన్నారు. .డ్రైనేజీ, సిసి రోడ్లు, వీధి దీపాలు, మంచినీటి సౌకర్యం పెన్షన్లు గురించి వివరించి చెప్పారు. సచివాలయాలలో ఎంతమంది సిబ్బంది ఉన్నారో పేర్కొన్నారు. ఇంటి పన్నుల కూడా సూచించారు.

గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ అద్భుతంగా పనిచేస్తుందని ఆమె సంతోషాన్ని వ్యక్త చేసింది. గ్రామాలలోనే కాకుండా రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు అర్హులైన ప్రతి కుటుంబానికి సూపర్ సిక్స్ పథకాలు అందాయని అనడం జరిగింది. గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ నుంచి గ్రామానికి వచ్చిన నిధులు గురించి, వాటిని వేటికి ఉపయోగించారో పేర్కొన్నారు. ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని సూచించారు.

You cannot copy content of this page

Scroll to Top