సమాచార హక్కు చట్టం సెమినార్ కు ఇనుముల సతీష్ కు ఆహ్వానం

TRINETHRAM NEWS

సమాచార హక్కు చట్టం సెమినార్ కు ఇనుముల సతీష్ కు ఆహ్వానం.

పెద్దపల్లి జిల్లా : జనవరి 18
హైదరాబాద్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లో రెండు రోజుల పాటు నిర్వహించే సమాచార హక్కు చట్టం రాష్ట్ర స్థాయి సెమినార్ వర్క్ షాపుకు మంథని కి చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త, మంథని డివిజన్ మీడియా కన్వీనర్ ఇనుముల సతీష్ కు ఆహ్వానం అందింది.

ఈ మేరకు ఈనెల 19 మరియు 20వ తేదీల్లో నిర్వహించే అనే వర్క్స్ షాపు లో రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖల అధికారులతో పాటు ఆర్.టీ. ఐ. ఆక్ట్వీస్ట్ లకు నిర్వహించే సెమినార్ లో పాల్గొనవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మరియు డైరెక్టర్ జనరల్ పంపిన లేఖలో పేర్కొన్నారు.

కాగా పెద్దపల్లి జిల్లా మంథని నుండి రాష్ట్ర స్థాయి వర్క్స్ షాపు సెమినార్ కు ఆహ్వానం అందడం పట్ల మంథని డివిజన్ కాంగ్రెస్ నాయకులు సమాచార హక్కు చట్టం కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

You cannot copy content of this page

Scroll to Top