
ఆన్‌లైన్ జూదం యువతను నిర్వీర్యం చేస్తోంది జనసేన మండల అధ్యక్షుడు చిట్టం మురళి ఆవేదన
ఆంధ్రప్రదేశ్ త్రినేత్రం న్యూస్ అనంతగిరి, ఏప్రిల్ 14: అనంతగిరి జనసేన మండల అధ్యక్షులు చిట్టం మురళి మాట్లాడుతూ. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని యువత తమ లక్ష్యాలను సాధించాలి అనేది జనసేన పార్టీ అభిప్రాయమని, కానీ ప్రస్తుత కాలంలో అదే సాంకేతికత పతనానికి దారితీస్తోందని జనసేన మండల అధ్యక్షుడు చిట్టం మురళి ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ వాడకంతో జీవనం సులభతరం అవుతున్నా, అదే మార్గంలో యువత ఆన్‌లైన్ జూదం, బెట్టింగ్ లాంటి వలల్లో చిక్కుకుపోతున్నారు. అనేక పేద, మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లల వల్ల అప్పుల ఊబిలోకి వెళ్లి రోడ్డున పడుతున్న ఉదాహరణలు రోజూ చూస్తున్నాం” అని చెప్పారు.
ఆన్‌లైన్ జూద వ్యసనం ఎంత తీవ్రంగా ప్రభావం చూపుతోందంటే, దేశవ్యాప్తంగా ఎంతో మంది యువకులు డబ్బు కోల్పోయి చివరికి ప్రాణాలను కోల్పోతున్నారు. పోలీస్ శాఖ ఇప్పటికే బహుళ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ, సెలబ్రిటీలకూ, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకూ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.
చిట్టం మురళి మాట్లాడుతూ,”ఈ తరుణంలో యువతకు మా వంతుగా ఒక సందేశం: స్మార్ట్‌ఫోన్ వినియోగం అవసరం అయినా, దాని మాయలో పడకండి. దీర్ఘకాలికంగా మొబైల్ స్క్రీన్ చూడడం వల్ల రేటినా ప్రభావితం అవుతోంది, బ్రెయిన్ ఎనర్జీ తగ్గుతోంది, జీవక్రియ మందగిస్తుంది, రేడియేషన్ వల్ల నరాల వ్యవస్థ మారిపోతోంది, స్పెర్మ్ కౌంట్ తగ్గి వ్యందత్వం పెరుగుతోంది. ఇవన్నీ గుర్తించి, సాంకేతికతను జాగ్రత్తగా వాడాలి” అని హితవు పలికారు.
సాంకేతిక విజ్ఞానాన్ని సరైన దిశలో వాడుకుంటే అది శక్తిగా మారుతుందనీ, లేకపోతే శాపంగా పరిణమిస్తుందని ఈ సందర్భంగా చిట్టం మురళి అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
