Instructions : బతుకమ్మ ,విజయ దశమి పండుగల సందర్భంగా ఇలాంటి ఇబ్బందులు రాకుండా తగిన ఏర్పాట్లుకు అధికారులకు ఆదేశాలు

TRINETHRAM NEWS

అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) కమిషనర్ జె .అరుణ శ్రీ

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. శనివారం రోజున నగర పాలక సంస్థ అధికారులు , సిబ్బందితో కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ ఆడే ప్రాంతాలను ముందుగా గుర్తించి పరిశుభ్రం చేయించాలని అన్నారు. బతుకమ్మ ఆడిన మరుసటి రోజు ఉదయమే ఆకులు, పూలను కంపోస్ట్ యార్డ్ కు తరలించాలని అన్నారు. వార్డు అధికారులు అందించిన వివరాల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో రోడ్లపై గతుకులు , గుంతలు పూడ్చడం , తవ్వకాలు జరిగిన చోట పునరుద్దరణ చేపట్టడం . లైటింగ్స్ ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని అన్నారు. గోదావరి వంతెన వద్ద కూడా విగ్రహాల నిమజ్జనం సాఫీగా జరగడానికి తగిన లైటింగ్ , ప్లాట్ ఫార్మ్ ల ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఆయా విభాగాల అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ స్టేడియం లో దసరా ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించాలని అన్నారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్ , సూపరింటెండింగ్ ఇంజనీర్ గురువీర , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్ , డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి , అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు , సెక్రెటరీ ఉమా మహేశ్వర్ రావు, నగర పాలక సంస్థ అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Instructions during the Bathukamma and Vijayadashami festivals

You cannot copy content of this page

Scroll to Top