దేవరకొండ డివిజన్ నవంబర్ 19 త్రినేత్రం న్యూస్. మాజీ ప్రధాని, భారతదేశ చరిత్రలో అజరామర నాయకురాలు, స్వర్గీయ ఇందిరా గాంధీ 108వ జయంతిని పురస్కరించుకొని దేవరకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేడు ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ వేడుకలకు దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలునాయక్ ముఖ్య అతిథిగా హాజరై, ఇందిరాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మీడియాతో మాట్లాడుతూ …
ఇందిరా గాంధీ భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు.
పేదల సంక్షేమం, వ్యవసాయ విప్లవం, హరిత విప్లవం, బ్యాంకుల జాతీయీకరణ వంటి అనేక చారిత్రక నిర్ణయాలతో దేశ అభివృద్ధికి మార్గదర్శకులయ్యాయని ఆయన గుర్తు చేశారు.
పేద ప్రజల పట్ల ఆమెకున్న అంకితభావం, ధైర్యసాహసాలు నేటికీ ప్రతి నాయకుడికి స్పూర్తిగా నిలుస్తాయని,
అలాగే, గ్రామీణ అభివృద్ధి, మహిళా సాధికారత, జాతీయ భద్రత వంటి అంశాల్లో ఇందిరాగాంధీ చూపిన దూరదృష్టి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


