జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 05 at 10.13.03 PM

TRINETHRAM NEWS

Trinethram News : 5th Jan 2024

హైజాక్‌కు గురైన నౌకలోకి భారత నేవీ కమాండోలు..!

హిందూ మహా సముద్రంలో లైబీరియా జెండా కలిగి ఉన్న ఓ నౌక (MV LILA NORFOLK) గురువారం సాయంత్రం హైజాక్‌కు గురైంది. ఈ విషయం తెలుసుకున్న భారత నావికాదళం ఐఎన్‌ఎస్‌ చెన్నై యుద్ధ నౌకను రంగంలోకి దింపింది..

హెలికాప్టర్‌ ద్వారా హైజాకర్లకు హెచ్చరికలు జారీ చేశామని అధికారులు తెలిపారు. బందీలను విడిపించేందుకు నేవీ కమాండోలు హైజాక్‌కు గురైన నౌకలోకి ప్రవేశించి, కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. గురువారం సాయంత్రం గుర్తుతెలియని సాయుధులు నౌకలోకి అక్రమంగా ప్రవేశించారని యూకే మారిటైమ్‌ ఏజెన్సీకి సందేశం పంపడంతో ఈ హైజాక్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నౌకలోని 15 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది..

You cannot copy content of this page