TRINETHRAM NEWS

Trinethram News : కెన్యాలో వరద బాధిత ప్రజలకు సాయం అందించేందుకు భారత్ సిద్ధమైంది.

కెన్యా ప్రజలకు మంగళవారం 40 టన్నుల మందులు, వైద్య సామగ్రిని పంపింది.

సరుకులను భారత వైమానిక దళానికి చెందిన సైనిక రవాణా విమానంలో ఆఫ్రికన్ దేశానికి పంపారు.

కెన్యా వరద బాధితులకు రెండో విడత సాయాన్ని పంపించామని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు.

ప్రపంచానికి విశ్వబంధువుగా భారత్ నిలబడుతోందని ప్రశంసించారు