WhatsApp Image 2025 01 28 at 17.06.05
అబివృద్ధిపేరుతో,ఆదివాసులను,అథహాపాతలనికి తొక్కుతున్న కూటమి నాయకులు
గిరిజనులు జోలికివస్తే ఖబడ్దార్ అయ్యన్న(గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాల్ దేవ్)
అల్లూరి జిల్లా అరకులోయ, త్రినేత్రం న్యూస్,జనవరి 29.
టూరిజం అభివృద్ధి పేరుతో 1/70 చట్టం సవరణ చేయాలని సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రకటించడం ఆదివాసుల హక్కులు చట్టాలకు తీవ్ర విఘాతం . ఆదివాసీ అభివృద్ధి అంటే హోటల్లు, రెస్టారెంట్లు నిర్మాణం కాదని కాపీ,చింతపండు,అడ్డకాలు ఇతర వాణిజ్య అటవీ ఉత్పత్తుల కుటీరా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి.
ఆదివాసి ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చెందాలంటే హోటళ్ళు,రెస్టారెంట్లు, పార్కులు నిర్మాణం కోసం 1/70 చట్టం సవరణకు రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం లోతైన అధ్యయనం చేయాలని అప్పుడే పెట్టుబడులు పెరిగి టూరిజం అభివృద్ధి చెందుతుందని సాక్షాత్తు ఆంధ్ర ప్రదేశ్ సభాపతి అయ్యన్నపాత్రుడు ప్రకటించడం ఆదివాసి హక్కులు చట్టాలకు తీవ్రమైన విఘాతం కలిగించి ఆదివాసులకు ద్రోహం చేయడమేనని తక్షణమే ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి ప్రకటన వెనక్కు తీసుకోవాలని ఆదివాసి గిరిజన సంఘం అల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శరభగుడలో నిరసన తెలిపారు.
ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మండల నాయకులు మాట్లాడుతూ 2025 జనవరి 27న విశాఖపట్నం నోవాటేల్ జరిగిన ప్రాంతీయ పెట్టుబడుల సదస్సు (రీజన్ ఇన్వెస్టర్ సబ్మిట్) లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఆదివాసి ప్రాంతంలో టూరిజం అభివృద్ధి కోసం హోటల్లు రెస్టారెంట్లు పార్కులు పెట్టుబడులు పెట్టాలంటే 1/70 చట్టం సవరణకు రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం లోతైన అధ్యయనం చేసి సవరణ చేయాలని సాక్షాత్తు శాసనసభ సభాపతి ప్రకటించడం ఆదివాసులకు ద్రోహం చేయడమేనని ఆదివాసులకు రక్షణ కవచంగా ఉన్న 1/70 చట్టం సవరణ చేస్తే ఆదివాసి షెడ్యూల్ ప్రాంతంలో బడా పెట్టుబడిదారులు కార్పొరేట్ కంపెనీలు ఆదివాసీ సంపదలైన అడవులు, ఘనులు, ఖనిజాలు, ప్రకృతి అందాలు స్వాధీనం చేసుకుని వ్యాపారం సాగిస్తాయని ఆదివాసుల జీవన విధానం ధ్వంసం అవుతుందని తక్షణమే ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి ప్రకటన వెనక్కు తీసుకోవాలని ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్ చేస్తున్నది.
ఆదివాసుల అభివృద్ధి అంటే హోటల్లు రెస్టారెంట్లు పార్కుల నిర్మాణం కాదని ఆదివాసులు పండిస్తున్న కాఫీ,మిరియాలు, చింతపండు,పసుపు, పిప్పళ్లు,అడ్డాకులు ఇతర వాణిజ్య,అటవీ ఉత్పత్తుల కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆదివాసులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని జీవో నెంబర్ 3 చట్టబద్ధత కల్పించి నూరు శాతం రిజర్వేషన్ చట్టం చేయాలని ఆదివాసి ప్రాంత నివామకల్లో 100% ఆదివాసులతో నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి శాసనసభాపతి అయ్యనపాత్రుడు సిఫార్సు చేయాల్సిన అవసరం ఉందని ఆదివాసులకు అండగా నిలబడాల్సిన శాసనసభ సభాపతి ఆదివాసుల గుండెకాయ లాంటి ఆదివాసుల రక్షణ కవచం 1/70 చట్టం సవరణ చేయాలని ప్రభుత్వానికి సలహా ఇవ్వడం ఆదివాసులకు తీవ్రమైన అన్యాయం చేస్తూ ద్రోహం చేయడమేనని తక్షణమే ప్రకటన వెనక్కు తీసుకుని ఆదివాసుల అభివృద్ధి, 100% నియామక చట్టం కోసం శాసనసభలో చర్చించి ఆదివాసులకు న్యాయం చేయాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కిల్లో కేశవ్ భగవాన్, వంతల మోహన్, జన్నీ కార్తిక్, కీల్లో మోహన్, బురిడి లక్ష్మణ్, కొర్రా సువర్ణరాజు, సోమేలి రాజు,తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
