Another Online Scam : ఎస్ బీఐ యోనో యాప్ బ్లాక్ అయ్యింది అని మెసేజ్ లు వస్తే పొరపాటున కూడా ఆ ఫైల్ ఓపెన్ చేయకండి…. ఈ మెసేజ్ లు పై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఇదిగో!

TRINETHRAM NEWS

ఎస్బీఐ యోనో యాప్ బ్లాక్ అవుతుందంటూ నకిలీ ప్రచారం

ఆధార్ అప్‌డేట్ కోసం ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ చేయాలంటూ మెసేజ్‌లు

ఇది పూర్తిగా మోసమని తేల్చిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్

వ్యక్తిగత,బ్యాంకింగ్ వివరాలు పంచుకోవద్దని సూచన

Trinethram News : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) యోనో యాప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఓ నకిలీ సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయకపోతే మీ యోనో యాప్ బ్లాక్ అవుతుందని ఈ మెసేజ్‌లో హెచ్చరిస్తున్నారు.అయితే,ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని,ఇదొక మోసపూరిత సందేశమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది.

ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవడానికి ఓ ఏపీకే (ఏపీకే) ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసుకోవాలని సైబర్ నేరగాళ్లు ఈ సందేశంలో కోరుతున్నారు.దీని ద్వారా వినియోగదారుల వ్యక్తిగత,బ్యాంకింగ్ వివరాలు,పాస్‌వర్డ్‌లు,ఓటీపీలు తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

SBI YONO app has been blocked, do not open

You cannot copy content of this page

Scroll to Top