త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. వార్షిక తనిఖీలలో భాగంగా, డిఐజి, ఛార్మినార్ జోన్ (జోన్ -6), తఫ్సీర్ ఇక్బాల్, ఈరోజు జిల్లాలోని చెంగోముల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ భవనం, పరిసరాలను పూర్తిగా పరిశీలించి, రికార్డులు, కేసుల వివరాలు, మరియు వివిధ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు చాలా బాగా పని చేస్తున్నారని ప్రశంసించారు. చెంగోముల్ పోలీస్ స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని, కేసులలో కన్విక్షన్ రేటును పెంచాలని ఆదేశించారు. పోలీస్ అధికారులు ప్రజలలో రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యల నివారణపై అవగాహన పెంచాలని సూచించారు. గ్రామాలలో విలేజ్ పోలీస్ అధికారులను నియమించి, ప్రజలతో మమేకమై సైబర్ క్రైమ్ మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పారు. గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి ప్రజలు సహకరించాలని కోరారు. ఎక్కడైనా గంజాయి ఉన్నట్లు అనుమానం వస్తే, వెంటనే స్పెషల్ సెర్చ్ ఆపరేషన్లు మరియు నార్కోటిక్స్ డాగ్స్‌తో తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం డిఐజి పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడుతూ, ప్రజలతో మర్యాదగా మరియు స్నేహపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును సకాలంలో స్వీకరించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. యువత భవిష్యత్తును నాశనం చేసే గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన గ్రామాలలో ప్రజలతో మమేకమై, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని, రౌడీలు, అనుమానితులపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. సిబ్బందికి ఏవైనా ఇబ్బందులు ఉంటే నేరుగా అధికారులను సంప్రదించవచ్చని, ఉన్నతాధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి, , అదనపు ఎస్పీ బి. రాములు నాయక్, పరిగి డిఎస్‌పి ఎన్. శ్రీనివాస్, పరిగి సిఐ శ్రీనివాస్ రెడ్డి, చెంగోముల్ ఎస్‌ఐ భరత్ కుమార్ రెడ్డి మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


