TRINETHRAM NEWS

అయోధ్య రామ మందిరానికి రూ.50 కోట్లు విరాళం ఇచ్చిన ప్రభాస్‌? అని హోరెత్తిన షోషల్ మీడియా ఈ వార్త లో నిజమెంత!
ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ అయ్యాడు.

ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కామెంట్స్‌తో ఇప్పుడంతా ‘డార్లింగ్‌’ గురించే మాట్లాడుకుంటున్నారు.

జనవరి 22న జరిగే అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠకు ప్రభాస్‌ రూ. 50 కోట్లు విరాళం ఇచ్చారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.

దీంతో ఇప్పుడు ఏ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం చూసిన దీనిపైనే చర్చ జరుగుతుంది.

ఎందుకుంటే దీనిపై ఇప్పటి వరకు ప్రభాస్‌ కానీ ఆయన టీం నుంచి కానీ విరాళం ఇచ్చినట్టు ఎక్కడ అధికారిక ప్రకటన లేదు.
దీంతో ప్రభాస్‌ విరాళం ఇచ్చారా? లేదా? అనేది ఇప్పుడు అందరిలో నెలకొన్న సందేహం.

అసలు విషయం బయటకు వచ్చింది. నిజానికి ఇప్పటి వరకు అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ప్రభాస్‌కు అసలు ఆహ్వానమే అందలేదట.

ఈ విషయం షాకిస్తున్న అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.

అసలు ఆహ్వానమే అందని ప్రభాస్‌ ఆలయం ప్రారంభోత్సవం కార్యక్రమం రోజున అందించే ఆహార ఖర్చులను చూసుకునేందుకు ముందుకు వచ్చాడంటూ ఇటీవల ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే కామెంట్స్‌తో ప్రభాస్‌ అయోధ్య రామమందిరానికి విరాళం ప్రకటించాడంటూ ప్రచారం మొదలుపెట్టారు.

దీంతో ఈ రూమర్లకు చెక్‌ పెట్టెందుకు తాజాగా ప్రభాస్‌ టీం స్పందించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

రామమందిరం కోసం ప్రభాస్‌ ఎలాంటి విరాళం ఇవ్వలేదని, అంతేకాదు ఎలాంటి ఆహార ఖర్చులు చూసుకుంటానని ఆయన మాట కూడా ఇవ్వలేదని ఓ బాలీవుడ్‌ మీడియాకు వెల్లడించినట్టు మరో వార్త బయటకు వచ్చింది.

ప్రభాస్ కు అందని ఆహ్వానం
కాగా మరో మూడు రోజుల్లో జరిగే అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు రజనీకాంత్, చిరంజీవి, రామ్ చరణ్, ధనుష్‌లతో పాటు కొందరు సౌత్ సెలబ్రిటీలకు మాత్రం ఆహ్వానం అందింది. అయితే ఇందులో ప్రభాస్‌ పేరు లేకపోవడంతో ఫ్యాన్స్‌ హర్ట్‌ అవుతున్నారు. మరి చివరిక వరకైనా ప్రభాస్‌కు ఆహ్వానం అందుతుందో లేదో చూడాలి. ఇదిలా ఉంటే నవరి 22న మధ్యాహ్నం 12:15 నుండి 12:45 వరకు ఆలయంలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. అలాగేఈ కార్యక్రమానికి ఆలయ ట్రస్ట్‌ ద్వారా దాదాపు 7 వేల మందికి పైగా ఆహ్వానం అందినట్లు సమాచారం.