TRINETHRAM NEWS

Hospital premises should be kept clean

*జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, జూలై-17: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జిల్లా ఆసుపత్రి ప్రాంగణం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.

బుధవారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

జిల్లా ఆస్పత్రిలో ఉన్న బ్లడ్ బ్యాంక్, ఫార్మసీ విభాగం, కంటి వైద్య విభాగం, దంత వైద్య విభాగం, టాయిలెట్లు, జనరల్ వార్డ్ లను కలెక్టర్ పూర్తి స్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, జిల్లా ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉంటే వెంటనే తాత్కాలిక ప్రాతిపదికన నియామకం చేసేందుకు ఫైల్ పెట్టాలని కలెక్టర్ సూచించారు.

జిల్లా ఆసుపత్రి పారిశుధ్యం అంశంలో కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ రెగ్యులర్ గా టాయిలెట్లను శుభ్రం చేయాలని, ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, డ్రైయినేజిలో ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే సంబంధిత ఇంజనీర్లకు తెలియజేసి మరమ్మత్తు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు.

ఆసుపత్రి పారిశుధ్య కాంట్రాక్టర్ కు వెంటనే మెమో జారీ చేయాలని, పారిశుధ్య కార్మికులు రెగ్యులర్ గా వచ్చి ఆస్పత్రి ప్రాంగణాన్ని శుభ్రం చేయని పక్షంలో వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

జిల్లా ఆసుపత్రి ఆపరేషన్ విభాగంలో అవసరమైన ఆప్తమాలజిస్ట్ మైక్రోస్కోప్ ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో ఇద్దరు దంత వైద్యులు అందుబాటులో ఉన్నందున జిల్లా ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రిలో దంత వైద్య సేవలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.

జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగులకు అందించే మందుల చిట్టిలు, వారికి సరఫరా చేసిన మందుల వివరాలు పూర్తి స్థాయిలో ఈ అవషదీలో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రిలో రోగులకు అందించే డైట్ వివరాలను ఆర్.ఎం.ఓ రెగ్యులర్ గా మానిటర్ చేయాలని,రోగులకు ప్రతి రోజు గుడ్లు, నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఆకస్మిక తనిఖీ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్, వైద్య అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Hospital premises should be kept clean