కాలనీవాసుల ఆందోళన.
దేవరకొండ డివిజన్ డిసెంబర్ 03 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో డిండి రోడ్డు లోగల సాయి శివ గార్డెన్స్ కు ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేయబడిన హనీ వైన్స్ పర్మిట్ రూం నిర్మాణం చేయవద్దని సాయినగర్ వాసులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ఇండ్ల మధ్యలో పర్మిట్ రూం నిమిస్తే ప్రజలు , మహిళలకు చాలసిబ్బంధులు ఎదురవుతాయని , కాలనీవాసులు యోగక్షేమాలు దృష్టిలో వుంచుకొని పర్మిట్ రూం నిర్మాణం చేయవద్దని కోరారు.
హనీ వైన్స్ యజమానులు మున్సిపాలిటీ పర్మిషన్ లెటర్ లేకుండానే నిర్మాణం చేయడం ఎంతవరకు న్యాయం అని కాలని వాసులు వాపోతున్నారు. ఈ కార్యక్రమంలో సాయి నగరర్ కాలనీవాసులు , మహిళలు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


