వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. లావసాటి పంటలు పండించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో అధిక సాంద్రత పంటల సాగు, నానో యూరియా, డిఎపి వాడకం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు కలెక్టర్ రాజేశ్వరి అధికారుల ఉద్దేశించి మాట్లాడుతూ… రైతులకు అధిక లాభాలు వచ్చే విధంగా పంటల సాగుకు ప్రోత్సహించాలన్నారు. పంటల సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు, మెలుకువలను రైతులకు తెలియజేయాలన్నారు.
సన్న రకం వరిని సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని, అదేవిధంగా సన్న రకం పండించిన రైతులకు క్వింటాల్ కు 500 రూపాయలు ప్రభుత్వం అందజేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ వారిలో అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు.ఎలాంటి వరిని పండిస్తే అధిక లాభాలు వస్తాయో అనే విషయాన్ని కూడా రైతులకు సూచించాలని ఆమె తెలిపారు. రైతులు శాస్త్రవేత్తలు సూచించిన విధంగా పంటలు సాగు చేసేలా రైతుల్లో అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.
జిల్లా వ్యవసాయ అధికారి రాజారత్నం మాట్లాడుతూ.. వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు రూపొందించిన వివిధ రకాల పంటలు సాగు చేసే విధంగా శాఖ పరంగా దృష్టి సారిస్తామన్నారు. రైతులకు వివిధ కంపెనీల వల్ల నాణ్యమైన విత్తనాలను అందించకపోవడం వల్ల రైతులు మోసపోతున్నారని, రైతులకు ముందస్తుగానే అన్యాయం జరగకుండా సూచనలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఆలస్యంగా నాట్లు వేయడం వల్ల దిగుబడి తక్కువగా వస్తుందని, రైతులందరూ సమయానుకూలంగా నాట్లు వేసే విధంగా రైతులకు సూచించాలన్నారు. సన్న రకాల వరిని పండించడంతోపాటు అధిక దిగుబడి వచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాలనిఆయన అధికారులు ఆయన సూచించారు.
ఈ సమావేశంలో పౌరసరఫరాల జిల్లా మేనేజర్ మోహన్ కృష్ణ, వ్యవసాయ శాస్త్రవేత్తలు రాజేశ్వర్ రెడ్డి, రాజా మధు శేఖర్, ఏడిఏలు సందీప్, శంకర్ రాథోడ్, లక్ష్మీ కుమారి, వెంకటేశం, కొమరయ్య, మండల వ్యవసాయ, విస్తరణ అధికారులు విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


