SP Sneha Mehra : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి… రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ,ఐ‌పి‌ఎస్ జిల్లా లోని మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇట్టి సంధార్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మహిళలకు గౌరవం మరియు సమాన అవకాశాలు లభించే సమాజంలోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.

నేటి తరం మహిళలు విద్య, ఉద్యోగం, వ్యాపారం, క్రీడలు మరియు రాజకీయ రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ సమాజ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఎస్పీ అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో మరింత మంది మహిళలు ఆత్మవిశ్వాసం, పట్టుదల మరియు సంకల్పంతో ముందుకు రావాలని ఎస్పీ ఆకాంక్షించారు.

మహిళల భద్రత మరియు రక్షణ విషయంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అవసరమైనప్పుడు మహిళలు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని, వారి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని ఎస్పీ భరోసా ఇచ్చారు.

మహిళల భద్రత కోసం ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా యువతలో అవగాహన పెంపొందించేందుకు పాఠశాలలు, కళాశాలలు మరియు గ్రామాల్లో షీ టీమ్, కళ జాత బృందం ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

మహిళలు తమ హక్కులు, చట్టాలు మరియు భద్రతకు సంబంధించిన సేవలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ స్నేహమెహ్ర సూచించారు.ప్రతి మహిళా తన హక్కులపై అవగాహన పెంపొందించుకుని ధైర్యంగా ముందుకు సాగుతూ తన లక్ష్యాలను సాధించాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Heartiest greetings to all the women of the district

You cannot copy content of this page

Scroll to Top