Baburam Naik : ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు

TRINETHRAM NEWS

బాబురాం నాయక్.
దేవరకొండ ఆగష్టు 09 త్రినేత్రం న్యూస్. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు విద్యార్థుల రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేతావత్ బాబు రాం నాయక్ గిరిజనులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజు కేవలం ఉత్సవం కాదు – మన చరిత్ర, సంస్కృతి, భూహక్కులు, స్వాభిమానాన్ని గుర్తు చేసుకునే మరియు శతాబ్దాలుగా కొనసాగుతున్న అన్యాయం, దోపిడీ, నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా గళమెత్తే రోజు అని పేర్కొన్నారు. గిరిజనుల తాతలు, ముత్తాతలు సహజసిద్ధమైన జీవన విధానంతో అడవులు, పర్వతాలు, వనరులను కాపాడుతూ పర్యావరణాన్ని సంరక్షించగా, వలస పాలన నుండి నేటి వరకు భూసంపద దోపిడీ, అటవీ భూముల కబ్జా, బలవంతపు తరలింపులు కొనసాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
“ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా గిరిజనుల గౌరవం, హక్కులు, సంస్కృతిని రక్షించడం మాటల్లో కాదు – చట్టాల కఠిన అమలులో, భూసంరక్షణలో, విద్యా-ఆరోగ్య అభివృద్ధిలో ప్రతిఫలించాలి” అని కేతావత్ బాబు రాం నాయక్ పిలుపునిచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Happy World Tribal Day

You cannot copy content of this page

Scroll to Top