జూన్ 26, 2026
TRINETHRAM NEWS

బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, రమావత్ రవీంద్రకుమార్.

బక్రీద్ పండుగ పర్వదిన పురస్కరించుకొని ముస్లిం సోదరి, సోదరమణులకు బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్రకుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..భక్తికి, త్యాగానికి, సహనానికి బక్రీద్ పండుగ ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. భక్తి, శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగను జరుపుకోవాలని సూచించారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు బక్రీద్ పండుగను జరుపుకుంటారని అన్నారు. పేదల పట్ల జాలి, దయ కలిగి ఉండటమే బక్రీద్‌ ఇచ్చే సందేశమన్నారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు టీవిన్ రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు Md.జనీబాబా, తదితరులు పాల్గొన్నారు .

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Happy Bakrid festival to

You cannot copy content of this page