జూన్ 26, 2026

WhatsApp Image 2024 10 26 at 18.00.40

TRINETHRAM NEWS

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి పెరుగుతున్న కాంగ్రెస్‌ సీనియర్ల మద్దతు….

Trinethram News : హైదరాబాద్‌ : జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి పార్టీ సీనియర్‌ నేతల నుంచి మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్‌ నాయకుడు జీవన్‌రెడ్డికి అనుచరుడు గంగారెడ్డి హత్య తరువాత తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో, జగిత్యాలలో జీవన్‌రెడ్డిని పరామర్శించేందుకు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ చేరుకున్నారు. గంగారెడ్డికి జరిగిన హత్య గురించి వివరాలు అడిగి తెలుసుకొని, ఆయనకు సానుభూతి తెలిపారు.

జీవన్‌రెడ్డి 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో కాంగ్రెస్‌ పార్టీకి అనేక సేవలు చేశారని, ఆ‍యన సేవలు పార్టీకి మరింత అవసరమని మధుయాష్కీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై, ప్రభుత్వ పాలనలో జీవన్‌రెడ్డి చెప్పిన అభ్యంతరాలను అధిష్టానానికి చేరువ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కొద్దిసేపటికే జాబితాపూర్‌లో గంగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వారిద్దరూ వెళ్లనున్నారు. అటు, నిన్న జీవన్‌రెడ్డికి అనుకూలంగా జగ్గారెడ్డి కూడా స్పందించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page