జూన్ 27, 2026

WhatsApp Image 2024 06 09 at 12.23.59

TRINETHRAM NEWS

Group 1 examination centers were inspected at field level

రామగుండం పోలీస్ కమీషనరేట్

గ్రూప్ 1 పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలో గోదావరిఖని లోని చైతన్య డిగ్రీ కళాశాల, పెద్దపల్లి పట్టణ కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మంచిర్యాల జోన్ మంచిర్యాల పట్టణ కేంద్రం లోని RBHV స్కూల్, ప్రభుత్వ బాలుర స్కూల్ లలో ఏర్పాటు చేసిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి పర్యవేక్షించారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్ల గురించి, పరీక్ష అనంతరం ఎగ్జామ్స్ షీట్స్ స్ట్రాంగ్ రూమ్ తరలింపు గురించి పోలీస్ అధికారులకు సిబ్బందికి తగు సూచనలు, సలహాలు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నందున 500 మీటర్ల లోపు ఎవరు కూడా గుమి కూడా వద్దని సూచించారు.

సిపి వెంట పెద్దపల్లి డిసిపి చేతన ఐపిఎస్, మంచిర్యాల డిసిపి అశోక్ కుమార్ ఐపీఎస్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు గోదావరిఖని ఏసిపి రమేష్ పెద్దపల్లి ఏసిపి జి కృష్ణ,మంచిరాల ఏసిపి ఆర్ ప్రకాష్, ఏ ఆర్ ఏసీపీ సురేంద్ర, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, పెద్దపెల్లి సిఐ కృష్ణ మంచిర్యాల ఇన్స్పెక్టర్ బన్సీలాల్, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, ఎస్ఐ లు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Group 1 examination centers were inspected at field level

You cannot copy content of this page