Groundbreaking Ceremony : మహిళా సమాఖ్య భవనం నిర్మాణ శంకుస్థాపన

TRINETHRAM NEWS
Groundbreaking Ceremony

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలి.

ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి …తీదేడు గ్రామ సర్పంచ్

Groundbreaking Ceremony : చింత పల్లి మార్చ్ 30, త్రినేత్రం న్యూస్. మహిళాల సంక్షేమానికి ప్రభుత్వం మరింత కృషి చేయాలని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు.చింతపల్లి మండలం తీదేడు (వెంకటంపేట) గ్రామంలో నూతనంగా నిర్మించనున్న గ్రామ మహిళా సమాఖ్య భవన నిర్మాణం కోసం శంకుస్థాపన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ,అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో మహిళలు పురుషులతో పాటు సమానంగా రాణించాలని ఆమె అన్నారు.మాజీ సీఎం కేసీఆర్ మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని ఆమె గుర్తు చేశారు.ఆడబిడ్డ పెళ్లికి సహాయం పుట్టిన బిడ్డ నుండి ఇంటికీ చేర్చేవరకు దేశంలో మహిళలకు ఎక్కడ లేని విధంగా తెలంగాణాలో పథకాలు అమలయ్యని ఆమె అన్నారు. మహిళలూ తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు…నేలమీద నుండి అంతరిక్షంలోకి వెళ్ళేదాకా మహిళాలదే ఆధిపత్యం నడుస్తుందని ఆమె అన్నారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు దేశానికి ఆదర్శం అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్, మాజీ ఉప సర్పంచ్లు ఉలుపాల శేఖర్ రెడ్డి,ధరణిపతి రమణారావు,గ్రామ పాలక వర్గం సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి, మాదగోని కృష్ణ గౌడ్, గంటెల అలివేలు సోమయ్య, దాసరి కళమ్మ ముత్తయ్య, రెడ్డి పద్మ పరమేష్ ముదిరాజ్,సందె లక్ష్మయ్య,మర్ల యాదగిరి, శివర్ల పర్వతాలు యాదవ్, గ్రామస్తులు మర్రు రామారావు, సిమర్ల శ్రీను యాదవ్,జూలురి శ్రీధర్, దాసరి తిరుపతయ్య, శివర్ల రాములు,వీరమల్ల వెంకటయ్య, వీరమల్ల సత్తయ్య,గంటెల ఆంజనేయులు, సందె శంకర్,ఉడుత చిన్న వెంకటయ్య,పంబాల చెన్నయ్య, కొన్రెడ్డి వడ్డయ్య,సందె బిక్షం, కాటెపాక వెంకటయ్య, పి.ఆర్.టెన్నికల్ అసిస్టెంట్ మల్లేష్, పంచాయతీ కార్యదర్శి బాదిని అశోక్,పీల్డ్ అసిస్టెంట్ పంబాల చంద్రయ్య,వి.బి.కే లు గంటెల ఇందిరా,పంబాల అరుంధతి,సంఘబంధం అధ్యక్షురాలు ఆమనూరి మనీష కుమార్,తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top