ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ

TRINETHRAM NEWS

జోగులాంబ గద్వాల జిల్లా (మార్చి 10): ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ టి. శ్రీనివాస రావు బాధితుల నుండి 10 ఫిర్యాదులను స్వీకరించి వాటిని చట్టప్రకారం పరిశీలించవలసిందిగా ఆయా పోలీస్ స్టేషన్ లో ఎస్సై లకు సూచించారు. భూ తగాదాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్న కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని, ఏలాంటి ఆవేశాలకు లోను కారాదని, చట్టాన్ని ఉల్లంఘించరాదని, అలాగే పోలీస్ స్టేషన్లకు, ప్రధాన కార్యాలయాలకు వెళ్లేవారు మధ్యవర్తులను తీసుకువెళ్లరాదని, బాధితులు మాత్రమే ధైర్యంగా వెళ్లి ఫిర్యాదు చేయాలని ఫిర్యాదుదారులకు ఎస్పీ తెలిపారు.

పోలీసులు బాధితులు తీసుకొవచ్చే ఎలాంటి ఫిర్యాదులు పెండింగ్లో ఉంచరాదని ఒకవేళ పెండింగ్ ఉంటే అందుకు సంబంధించి సమాచారాన్ని ఫిర్యాదుదారులకు తెలియజేయాలని వీలైనంతవరకు ఫిర్యాదులను వెంటనే చట్ట ప్రకారం పరిష్కరించాలని ఫోన్లో మాట్లాడి సంబంధిత అధికారులకు సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ నిరంతరం పని చేస్తుందని, పోలీసులు ప్రజల మన్ననలు పొందే విధంగా విధులు నిర్వర్తించి వారికి సరైన న్యాయం అందించి భరోసా, భద్రత కల్పించాలని సూచించారు. ప్రస్తుతం అధునాతన టెక్నాలజీ పెరుగుతున్నందున సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి కావున ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అత్యవసర సమయంలో డయల్ 100 లేదా 1930 కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు.

ఈ ప్రజావాణి కార్యక్రమంలో గద్వాల్, ఆలంపూర్ మరియు శాంతి నగర్ సిఐ లు టి. శ్రీను, రవి బాబు, టాటా బాబు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Grievances should be redressed

You cannot copy content of this page

Scroll to Top