WhatsApp Image 2024 11 08 at 19.18.26
ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
చొప్పదండి: త్రి నేత్రం న్యూస్
చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ముఖ్య అతిథిగా హాజరైన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ప్రారంభించి, నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని, పదేళ్లుగా ధ్వంసమైన వ్యవస్థలను ఒక్కొక్కటిగా గాడిలో పెడుతున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నారని, రాబోవు రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర భాగాన నిలబెట్టగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. వారి ఆశీర్వాదంతో చొప్పదండి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ది చేసుకుంటామన్నారు. రక్తదాన శిబిరంలో 45 యూనిట్ల రక్తం సేకరించగా దాతలకు అభినందనలు తెలిపి, కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, పలువురు ప్రజా ప్రతినిధులు, రక్తదాతలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
