నెట్ వర్క్ లేక ప్రభుత్వ సేవలకు ప్రజలు విలవిల.
అల్లూరిజిల్లా(హుకుంపేట) త్రినేత్రం న్యూస్ జూన్ 25. అల్లూరి సీతారామరాజు జిల్లా, హుకుంపేట మండలం పాతకోట గ్రామ సచివాలయ పరిధిలో జియో నెట్‌వర్క్ సేవలు గత ఆరు నెలలుగా తీవ్రంగా అంతరాయం కలిగిస్తున్నాయి. నెట్‌వర్క్ సమస్యల కారణంగా ప్రజలు అత్యవసర సేవలను పొందలేక తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. ముఖ్యంగా సచివాలయం ద్వారా లభించే పలు ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్ ఆధారంగా మాత్రమే లభించడంతో, గ్రామస్థులు 10 కి.మీ. దూరంలోని పెదగరువు, కొట్నాపల్లి వరకు వెళ్లి సేవలు పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ పాడి లక్ష్మి ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేయగా, నెట్ సౌకర్యాల విస్తరణపై ప్రత్యేకంగా తీర్మానం చేయబడింది. ఈ తీర్మానాన్ని జిల్లా కలెక్టర్ కి తెలియజేస్తూ, నోడల్ అధికారికి వేదిక మీదుగా అర్జీ అందజేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు కోటేశ్వరరావు పడాల్, వార్డు మెంబర్లు శివకుమార్ పడాల్, తెలుగుదేశం పార్టీ నాయకులు సుమన్, నరసింగరావు, పాలెం వార్డు మెంబర్ చిన్న భీమన్న, పాటి చిన్నయ్య (సూపర్ సర్పంచ్), ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామస్థులు స్థానికంగా నెట్‌వర్క్ సమస్య తీరే వరకు నిరంతరంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


