Trinethram News : గంగాధర మండలం లోని మధురానగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్ పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటున్నట్టు ఫిర్యాదు రావడంతో.. ఏసీబీ అధికారుల ఉచ్చులో చిక్కినట్లు ప్రాథమిక సమాచారం.
వివరాల్లోకి వెళితే..
ఒక వ్యక్తి దగ్గర మధురానగర్ గ్రామ పంచాయతీ సంబంధిత ఇందిరమ్మ ఇంటి బిల్లు కోసం డబ్బులు రూ.10,000 డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలియజేయగా, వారు ముందస్తు ప్రణాళికతో ట్రాప్ ఏర్పాటు చేసి కార్యదర్శిని లంచం స్వీకరిస్తున్న సమయంలో పట్టుకున్నారు. అధికారిని అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు పంచాయతీ కార్యాలయం, శోధనలు నిర్వహిస్తున్నారు. లంచం తీసుకున్న మొత్తం, సంబంధిత పత్రాలు, రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


