త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పదవ తరగతిలో స్టేట్ నాలుగో ర్యాంకు సాధించిన ఎస్ పల్లవి గౌడ్ ను సన్మానించిన చిత్తూరు నగర గౌడ సంఘం నాయకులు. చిత్తూరు గిరింపేటకు చెందిన శరవణ గౌడ్, అరుణల కుమార్తె పల్లవి గౌడ్. ఈమె పదో తరగతి పరీక్షలో 596 మార్కులు తో స్టేట్ నాలుగో ర్యాంక్ సాధించింది. అలాగే పూతలపట్టు మండలం ఈడిగ పల్లెకి చెందిన కళ్ళు గీత కార్మికుడు సురగాని కిరణ్ గౌడ్ పద్మజ ల కుమారుడు ప్రవీణ్ సాయి తేజ్ లను చిత్తూరు నగర ఈడిగౌడ్ సంఘం అధ్యక్షులు అపరాల వినోద్ గౌడ్ ఆధ్వర్యంలో చిత్తూరు పార్లమెంట్ టిడిపి ఈడిగ బీసీ సాధికార సమితి అధ్యక్షులు బుస నాగరాజుగౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు నగదు బహుమతి మెమెంటోలు మరియు విద్యా సామాగ్రి అందజేశారు. వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా నగర ఈడిగ గౌడ్ సంఘం ప్రధాన కార్యదర్శి తోకల గోపి గౌడ్, మరియు లేబాకుల మురళి గౌడ్, కోదండ గౌడ్ మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


