Relief for Telangana Government.. Governor’s approval for seven bills
Trinethram News : Telangana : రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపిన బిల్లుల్లో ఏడింటికి ఆమోదం లభించింది. మరో నాలుగు బిల్లులు పరిశీలనలో ఉన్నాయి.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల రాజ్‌భవన్ వెళ్ళి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో భేటీ అయిన సందర్భంగా బిల్లుల గురించి ప్రస్తావించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దానికి కొనసాగింపుగా ఏడు బిల్లులకు గవర్నర్ శనివారం ఆమోదం తెలిపారు. ఇందుకు సంబంధించి రాజ్‌భవన్, ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడకపోయినా త్వరలోనే గెజిట్ జారీ కానున్నట్లు తెలిసింది.
ఆమోదం పొందిన ఏడు బిల్లుల్లో మూడు పంచాయతీరాజ్ విభాగానికి చెందినవి కాగా ఒకటి పురపాలక శాఖకు సంబంధించినది. ప్రైవేటు యూనివర్శిటీల ఏర్పాటు, టిమ్స్ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆస్పత్రుల నిర్మాణం, మైనారిటీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లులకు కూడా ఆమోదం లభించింది. దీంతో మొత్తం ఏడు బిల్లులకు క్లియరెన్స్ రావడంతో పరిశీలనలో ఉన్న మరో నాలుగు బిల్లులపై త్వరలో స్పష్టత రానున్నది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App