Governor Kodandaram : కృత్రిమ అవయవాలు పంపిణీ చేసిన గవర్నర్ కోదండరాం

TRINETHRAM NEWS

పేదవారికి లయన్స్ క్లబ్ చేయూత..!

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో బుధవారం సేవా కార్యక్రమాల నిర్వహించారు. 320 జి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన సింహరాజు కోదండరాం మొదటిసారిగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పర్యటించారు. ఈ మేరకు రామగుండం లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు పోకల ఆంజనేయులు, సెక్రటరీ ముడుతనపల్లి సారయ్య, ట్రెజరర్ రాజేంద్రకుమార్ అధ్యక్షతన గోదావరిఖని జూనియర్ కళాశాల ప్రాంగణంలోని ప్రభుత్వ హై స్కూల్ విద్యార్థులకు ఐడెంటి కార్డులు పంపిణీ చేశారు. అలాగే సరస్వతి శిశు మందిర్ లో మొక్కలు నాటారు. అనంతరం లయన్స్ భవన్లో జరిగిన కార్యక్రమంలో సుమారు 35 మందికి కృత్రిమ అవయవాలను పంపిణీ చేసి, లయన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ డాక్టర్ బాబురావు ఘట్టమనేని జన్మదిన సందర్భంగా మీల్స్ ఆన్ వీల్స్ అన్న ప్రసాదం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పేదవారికి సేవలు చేయడంలో అంకితభావంతో పనిచేస్తారని, ప్రమాదంలో అంగవికులైన పేదవారికి సుదూర ప్రాంతాలకు వేల రూపాయలు ఖర్చు చేయలేని వారికి ఉచితంగా లయన్స్ క్లబ్ కృత్రిమ అవయవాలు పంపిణీ చేయడం లయన్స్ క్లబ్ సభ్యుల నిబద్ధతకు అద్దం పడుతుందని అన్నారు. అంతకుముందు గవర్నర్ గారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ డిస్టిక్ గవర్నర్ ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి, రీజినల్ చైర్మన్ కజాంపురం రాజేందర్, జోన్ చైర్మన్ పి మల్లికార్జున్, సీనియర్ సభ్యులు మేడిశెట్టి గంగాధర్, తిలక్ చక్రవర్తి, గుండ వీరేశం, కె లక్ష్మారెడ్డి, మనోజ్ కుమార్ అగర్వాల్, బేణి గోపాల్ త్రివేది, గుండ రాజు, తానిపర్తి విజయలక్ష్మి, ఆకు తోట సత్యనారాయణ రంగమ్మ, ఎల్ రమణారెడ్డి, బి కౌసల్య తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Governor Kodandaram distributes artificial

You cannot copy content of this page

Scroll to Top