WhatsApp Image 2024 09 13 at 15.31.12
Government should immediately give clarity on weightage marks 30 for National Health Mission contract employees
జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఏఐటియుసి అనుబంధం
వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం 1271 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ వేసిందని నోటిఫికేషన్లో ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజుపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని ఎన్ హెచ్ ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు. ప్రభుత్వం నోటిఫికేషన్ వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా రామ రాజేష్ ఖన్నా చెప్పిన విధంగా నోటిఫికేషన్లో చాలా అవకతవకలు ఉన్నాయని గత 24 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ లో పనిచేస్తున్న ఉద్యోగులము చాలా నష్టపోతామని ఆయన వాపోయారు.
గత ప్రభుత్వం ఏ.ఎన్.ఎం.లకు సంబంధించిన నోటిఫికేషన్ లో వెయిటేజ్ మార్కులు 30 మార్కులు ఇవ్వగా దానికి సమాన క్యాడర్ అయిన ల్యాబ్ టెక్నీషియన్ మరియు ఫార్మసిస్ట్ లకు నోటిఫికేషన్ లో మాత్రం 20 మార్కులు వేయడం సబబు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నోటిఫికేషన్లు పరిశీలించి వెయిటేజ్ ఇవ్వాలని రామ రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు. లేదంటే నోటిఫికేషన్ పై కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
