Gontelamma Jatara : అంగరంగ వైభవంగా అంబేద్కర్ నగర్ లో గొంతేలమ్మ జాతర వేడుకలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట మండలంలోని దొంతికుంట గ్రామంలో గ్రామదేవత గొంతేలమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఐదేళ్లకు ఒకసారి ఈ గొంతెలమ్మ జాతర 20 రోజులు పూజలు జరిపించి 21 రోజు ఊరేగిస్తారు. ఇవాళ ఆదివారం చివరి రోజు సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మధ్యాహ్న వేళ అన్నదానం ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమానికి దొంతుకుంట గ్రామ పెద్దలు, యువకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని అంగరంగ వైభవంగా పండుగ జరిపించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Gontelamma Jatara celebrations

You cannot copy content of this page

Scroll to Top