జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 27 at 15.36.56

TRINETHRAM NEWS

బంగారు బాల్యంపై అవగాహన ర్యాలీ…
Trinethram News : ప్రకాశం జిల్లా
కంభం మండలంలోని తురిమెళ్ళ అంగన్వాడి కార్యకర్తలు, ఎన్ ఆర్ తురిమెల్ల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు బుధవారం బంగారు బాల్యంపై భారీ ర్యాలీని నిర్వహించారు. సర్పంచి మాదా.సుభద్ర ఆధ్వర్యంలో ఆశాలు, అంగన్వాడి కార్యకర్తలు సచివాలయ సిబ్బంది సంయుక్తంగా బంగారు బాల్యంపై అవగాహన కలిగిస్తూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్.భాస్కర్ నాయుడు మాట్లాడుతూ బంగారు బాల్యం వారోత్సవాల్లో భాగంగా బాలల భవిత, భద్రతలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగించినట్లు తెలిపారు.బంగారు బాల్యం కార్యక్రమం బాలికలలో స్ఫూర్తిని ధైర్యాన్ని నింపిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు పివిఎన్ .కళ్యాణి, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, ఆశాలు,అంగన్వాడి కార్యకర్తలు సచివాల సిబ్బంది పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page