IMG 20241211 WA0052
జ్ఞాన నంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం
Trinethram News : వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 11 ఇటీవల హైదరాబాద్ నగరంలోని త్యాగరాయ జ్ఞాన సభ మందిరంలో జరిగిన కార్యక్రమంలో మర్పల్లి మండల పరిధిలోని పిలిగుండ్ల ప్రాథమికోన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయులు ఎండి.మోసిన్ రాష్ట్రస్థాయిలో జ్ఞాన నంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుఅందుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలో జిల్లా గణిత ఫోరం ఆధ్వర్యంలో ఎండి. మోసిన్ ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.మున్ముందు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా జిల్లా గణిత ఫోరం బృందానికి ఎండి.మోసిన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
