![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-06-at-17.18.06.jpeg)
తేజ పాఠశాలలో జన్మదిన వేడుకలకు మొక్కల బహుకరణ
Trinethram News : స్థానిక తేజ టాలెంట్ స్కూల్ విద్యార్థులు నూతన వరవడిని సృష్టిస్తున్నారు. పాఠశాలలో చదువుకొనే విద్యార్థుల పుట్టినరోజు వేడుకల్లో కేకులు, స్వీట్స్, చాక్లెట్స్ బదులుగా పాఠశాలకు మొక్కలను అందించి ఆ మొక్కలపై ఆ విద్యార్థి పేరు రాసి సంవత్సరముతో సహా ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో ఇది చాలా ఉపాయుక్తంగా ఉన్నదని ప్రిన్సిపల్ ఎం. అప్పారావు తెలిపారు.
పాఠశాలలో బర్త్డే పార్టీలు నిషేధించి, పాఠశాలలో మొక్కను నాటి,అదే రోజు వారికి తోచిన విధంగా అనాధ శరణాలయాలకు వెళ్లి పడ్లు ,ఆహార పదార్థాలు పంచి పెడుతున్నారు. నేడు పాఠశాలలో నాగ కార్తికేయ ఐదవ తరగతి విద్యార్థి జన్మదినం సందర్భంగా మామిడి మొక్కను బహుకరించారు. వారి తాత, అమ్మమ్మ, తల్లిదండ్రులు,చెల్లి పాఠశాలలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![birthday celebrations](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-06-at-17.18.06-1024x460.jpeg)