ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 03 14 at 15.51.37

TRINETHRAM NEWS

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారం కైలాష్ హిల్స్ కు చెందిన గంగుల అంజలి యాదవ్ ని తెలంగాణ ప్రదేశ్ మహిళాసేవాదళ్ సెక్రటరీ గా అల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ లాల్జీ దేశాయ్ నియమించినందున మరియు నల్గొండ పార్లమెంట్ ఇంఛార్జిగా తెలంగాణ ప్రదేశ్ మహిళాసేవాదళ్ మహిళా చీఫ్ భవాని త్రివేది నియమించినందున ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా ఓటర్లను ప్రభావితం చేసి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను తెలియజేసి పార్లమెంట్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్దనోళ్ల సజీవ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page