జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 13 at 4.09.11 PM

TRINETHRAM NEWS

స్పీకర్‌ పదవికి నామినేషన్‌ వేసిన గడ్డం ప్రసాద్‌కుమార్‌

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పదవికి వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శికి నామినేషన్‌ పత్రాలను ఆయన సమర్పించారు. ప్రసాద్‌కుమార్‌ వెంట సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు ఉన్నారు. ప్రసాద్‌కుమార్‌ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్‌ పత్రాలపై కేటీఆర్‌ సంతకం చేశారు. గురువారం ఉదయం శాసనసభలో స్పీకర్‌ ఎన్నిక నిర్వహించనున్నారు.

You cannot copy content of this page