TRINETHRAM NEWS

సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జే.ఏ.సి. నాయకులు.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు గోదావరిఖని సీఐటీయూ కార్యాలయంలో జేఏసీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సీఐటీయూ, టి.యూ.సీ.ఐ, ఐ.ఎఫ్.టి.యూ సంఘాల నాయకులు వేల్పుల కుమారస్వామి, తోకల రమేష్, ఈ.నరేష్ లు మాట్లాడుతూ రామగుండం రీజియన్ పరిధిలోని ఓసీపీ లలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులు గత 3 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతున్నామని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు.

లాభాలు ధ్యేయంగా సింగరేణి మరియు ఓ.బి.ప్రైవేట్ కంపెనీల జయమానులు పనిచేస్తున్నారని అన్నారు. కార్మికులకు చట్టాలను అమలు చేయాల్సి ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కి కార్మికులను బానిసలుగా మార్చి పనులు చేయించుకుంటున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనీ గెలిపిస్తే స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ హై పవర్ కమిటీ వేతనాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని అన్నారు.
ఆ హామీనీ ఇప్పుడు నిలబెట్టుకోవాలని అన్నారు. అంతే కాకుండా కనీస వేతనాలతో పాటు కనీస సౌకర్యాలు, రక్షణ పరికరాలు కూడా ఇవ్వడం లేదన్నారు. ఒక ప్రక్క కార్మికులు సమ్మె చేస్తుంటే మరో ప్రక్క ప్రైవేటు యాజమాన్యాలు పోలీసులను పెట్టీ క్యాంపు లో ఉన్న ఇతర రాష్ట్రాల కార్మికులతో పనులు చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. నిన్నటి నుండి చర్చల పేరుతో అధికార పార్టీ మరియు సింగరేణి యాజమాన్యం కావాలని కాలయాపన చేస్తుందనీ అన్నారు. రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్, మరియు
జే.బి.సి.సి.ఐ. సభ్యులు జనక్ ప్రసాద్ స్వయంగా చర్చల్లో ఉన్నారని అన్నారు. రెండవ రోజు చర్చలు కొనసాగుతున్నాయని ఈరోజైన జరుగుతున్న చర్చల్లో కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాడానికి ఒప్పందం చేసి కార్మికులకు న్యాయం చేయాలని అన్నారు. లేని పక్షంలో అన్ని కార్మిక సంఘాలను,కార్మికులను కలుపుకుని పెద్దయెత్తున పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు ఈశమవేశంలో నాయకులు నెర్వట్ల నర్సయ్య,రాజేశం పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Labor Unions J.A.C