జూలై 7, 2026

WhatsApp Image 2024 01 18 at 9.50.09 AM

TRINETHRAM NEWS

నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు: మంత్రి బట్టి విక్రమార్క

హైదరాబాద్:జనవరి 18
రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆ ప్రతిపాదనలపై అన్ని శాఖలతో ఆర్థికశాఖ సమావేశాలు నిర్వహిం చనుంది.

ఇందులో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఇవాళ్టి నుంచి ఆయా శాఖల మంత్రులు, అధికారులతో సమావేశమవుతారు.

మధ్యాహ్నం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన శాఖల ప్రతిపాదనలను భట్టి సమీక్షిస్తారు. 19వ తేదీన సీతక్క, దామోదర రాజనర్సింహలకు చెందిన శాఖల సమీక్ష ఉంటుంది.

20వ తేదీన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు.. 22వ తేదీన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ.. 23వ తేదీన పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులకు సంబంధించిన శాఖల సమీక్ష ఉంటుంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలకు సంబంధించిన సమావేశాలు 24, 25, 27వ తేదీల్లో జరగనున్నాయి.

You cannot copy content of this page