మంత్రి నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే వేగుళ్ళ…
త్రినేత్రం న్యూస్. మండపేట ఆగస్ట్ 27, వినాయకచవితి పండుగను ప్రజలంతా ఘనంగా జరుపుకొనేందుకు కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ ను అందిస్తుందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలిపారు. మండపేట లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గౌ॥మానవ వనరుల అభివృద్ది, ఐటి ఎలక్ట్రానిక్స్ మరియు, కమ్యూనికేషన్ మరియు ఆర్.టి.జి శాఖా మాత్యులు నారా లోకేష్, చొరవతో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ను అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కు వేగుళ్ళ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


