జూన్ 27, 2026
TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో శ్రీకాంత్ డెంటల్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా డాక్టర్ శ్రీకాంత్ మరియు డాక్టర్ సుమలత లు మాట్లాడుతూ, మానవ శరీరంలో దంతాలను ఆరోగ్యకరంగా ఉంచుకుంటే లాభాలు, ప్రతిరోజు దంతాలను ఏ విధంగా శుభ్రపరుచుకోవాలి మొదలైన చిట్కాలను బాలబాలికలకు వివరించారు.

ప్రతి ఒక్కరూ దంతాల సంరక్షణకు ప్రాధాన్యత వహించాలని సూచించారు. తదనంతరం విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి అవసరమున్న వారికి మందులు, మౌత్ వాష్ లు, టూత్ పేస్టులు, బ్రష్ లను అందించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ విధమైన ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ, పిల్లల భవిష్యత్తు ఆరోగ్యకరంగా ఉండటానికి కృషి చేస్తున్న శ్రీకాంత్ డెంటల్ బృందాన్ని అభినందించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Free Dental Camp

You cannot copy content of this page