తేదీ : 10/04/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , విద్య హక్కు చట్టం ప్రకారం వచ్చే విద్యా సంవత్సరం ప్రైవేట్ పాఠశాలలో ఇరవై ఐదు శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలని, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు 2025-2026 వ విద్యా సంవత్సరానికి పేద కుటుంబాల పిల్లలకు ఒకటవ తరగతిలో ప్రవేశాలు కల్పించాలని పేర్కొంది. ఒక్కొక్క విద్యార్థిపై ప్రభుత్వం చేసే ఖర్చు ఆధారంగా వ్యయాన్ని అంచనా వేసేందుకు కమిటీ ఏర్పరిచింది. నిర్ణయించిన ఫీజు ను ప్రభుత్వం భరిస్తుంది అని తెలిపారు .
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


