Mudiraj Bhavan : తాండూర్ లో 50 లక్షలతోముదిరాజ్ భవన్,కు శంకు స్థాపన,

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం,ప్రతినిధి.త్రినేత్రం న్యూస్.శుక్రవారం తాండూర్ నియోజక వర్గానికి సంబంధించిన ముదిరాజ్ ల కొరకు,ఎమ్మెల్యే ఎన్నికలలో ఇచ్చిన మాటప్రకారం ఎమ్మెల్యే భుయ్యని మనోహర్ రెడ్డి ముదిరాజ్ ల భవనం నిర్మించుటకు, ఇచ్చిన భూ స్థలం లో ,శుక్రవారం తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక,మత్స్య శాఖ మంత్రి వర్యు లు వాకిటి శ్రీహరి ముదిరాజ్ ఎమ్మెల్యే తో పాటు,భవన నిర్మాణం కోసం శంకు స్థాపన చేయడం జరిగింది. ఈ మేరకు వారు మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యేగా గెలిపించారు,నేను కూడా ముదిరాజ్ లకు గెలిపిస్టే ముదిరాజ్ భవన్ కట్టిస్తా నని మాట ఇచ్చాను,అందుకొరకు స్థలం ఇవ్వడం జరిగింది,ఇప్పుడు 50 లక్షల రూ.లు భవన నిర్మాణం కోస్రం మంజూరి చేయించారు,మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే అన్నారు,ఇంకా భవన నిర్మాణం కోసం ఎంత డబ్బులైన ఇస్తాం అన్నారు మంత్రి,కానీ బీసీలు ముదిరాజ్ యువత చదువుకొని మనం ఎట్ల అభివృద్ధి చెందాలో పోటీ పడాలన్నారు.తాండూర్ లో 65 వేల మంది ముదిరాజుల ఓట్లు ఉన్నాయంటే,ముదిరాజ్ లు ఎవరికి ఓట్లు వేస్తే వాళ్లే గెలుస్తారని తెలుస్తుందన్నారు.

అందుకే బీసీ ల జనగణన 29 రాష్ట్రాలలో చేయలేరు, ఒక్క తెలంగాణ లో నే జనగణన చేసి 42% బీసీ లకు రిజర్వేషన్ చేయడం జరిగిందన్నారు.అలాగే నిరంతరం ప్రజల కొరకు ఎప్పుడూ తపన పడే ఎమ్మెల్యే దొరకడం తాండూర్ నియోజక వర్గం ప్రజల అదృష్టం అన్నారు.ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి సుమారుగా 20 సార్లైన తిరిగి ,తాండూర్ నియోజకవర్గానికి 1000 కోట్ల నిధులు తీసుక వచ్చారు,90 కోట్ల నిధులు కోటిపల్లి ప్రాజెక్ట్ కొరకు మంజూరు చేయించారు. జరుగుతుందన్నారు. మహిళల ఉచితబసు ప్రయాణం,200 యూనిట్లుచిత కరంటు,సన్న బియ్యం,కొత్త రేషన్ కార్డులు,గ్యాస్ సబ్సిడీ,ఇందిరమ్మ ఇళ్లు,చేయడం జరుగుతుందన్నారు.అలాగే లొంక నర్సింలు ముదిరాజ్ A. బ్లాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త ఇల్లు వాస్త చేయడం జరిగిందన్నారు పెద్దేముల్ రోడ్ మార్గంలో పెట్రోల్ బ్యాంక్ ప్రక్కన ఉందన్నారు.

ఇట్టి కార్యక్రమం లో ,బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మెన్ ,రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్,రమేష్ మహారాజ్,రాకేష్ మహారాజ్,రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మెన్ కల్వాసుజాత,ఉత్తం చెందు ముదిరాజ్,డాక్టర్ సంపత్ కుమార్,శ్రీధర్ ముదిరాజ్ జిల్లా మత్స్య సహకార సంఘాల చైర్మెన్ ,జర్నప్ప ముదిరాజ్,రాజు కరణ్ కోటు మాజీ సర్పంచూ,తల్లారి వీరప్ప ముదిరాజ్,మాజీ సర్పంచ్,హన్మంతు ముదిరాజ్,మాజీ సర్పంచూ,తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Foundation stone laid for Mudiraj Bhavan

You cannot copy content of this page

Scroll to Top