గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని గాంధీ నగర్ లోని మధుస్ ఆశ్రమంలో కోలేటి సేవాదళ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ యూత్ లీడర్ పల్లె రమేష్ కోలేటి దామోదర్ జన్మదినం సందర్భంగా పిల్లలతో కలిసి కేక్ కట్ చేయించారు. అనంతరం పిల్లలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పల్లె రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్చరాల పాటు పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ గా రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్ లను ఆధునికరించడం జరిగిందని అన్నారు. కోలేటి దామోదర్ ఇంకా ఉన్నత పదవులను చేపట్టి ప్రజలకు మరిన్ని సేవలను అందించాలని, నిండునూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కోలేటి సేవాదళ్ సభ్యులు పాణి, శ్రీమాన్,చందర్, నిఖిల్, సుమన్, చోటు, కార్తీక్, చరణ్, సిద్దు, రాంబాబు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


