జూన్ 26, 2026

WhatsApp Image 2024 12 19 at 20.35.11

TRINETHRAM NEWS

చర్లపల్లి జైలు నుండి బయటకొచ్చిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి!

Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 19
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి, చ‌ర్ల‌ప‌ల్లి జైలు నుంచి ఈరోజు సాయంత్రం విడుద‌ల అయ్యారు.

చర్లపల్లి జైలు నుండి విడుదలైన న‌రేంద‌ర్ రెడ్డికి బీఆర్ఎస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఇక నరేందర్‌రెడ్డి కార్యకర్త లకు అభివాదం చేస్తూ విజ‌య సంకేతం చూపు తూ.. పార్టీ కేడ‌ర్‌లో జోష్ నింపారు.

వికారాబాద్‌ జిల్లా లగచర్ల లో అధికారులపై దాడి చేశారన్న అభియోగాల కేసులో అరెస్టయి, జ్యుడీషి యల్‌ రిమాండ్‌లో ఉన్న నరేందర్‌రెడ్డితో పాటు 24 మంది రైతులకు నాం పల్లి స్పెషల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన సంగ‌తి తెలిసిందే. బెయిల్ మంజూ రు చేస్తూ నాంపల్లి స్పెషల్ కోర్టు కొన్ని ష‌ర‌తులు విధించింది.

ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డికి రూ. 50 వేల పూచీక‌త్తుపై, మిగ‌తా వారికి రూ. 20 వేల పూచీక‌త్తుపై బెయిల్ మంజూరు చేసింది. పట్నం నరేందర్ రెడ్డికి రెండు షూరిటీలు, మిగితా వారికి ఒక షూరిటీ ఉండాలని తెలిపింది.అంతేకాకుండా 3 నెలల పాటు ప్రతీ బుధ వారం పట్నం నరేందర్ రెడ్డితోపాటు ఇతర నిందితులు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

నవంబర్‌ 11వ తేదీన వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో అధికారులపై స్థానికులు దాడి చేశారు. ఫార్మా పరిశ్రమ ఏర్పాటు కోసం అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ సహా ఇతర అధికారులు.. లగచర్లకు చేరుకున్న సమయంలో కొందరు వ్యక్తులు కర్రలు, రాళ్లతో అధికారులపై దాడికి దిగారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పలు వురు గ్రామస్తులను అరెస్ట్‌ చేశారు. ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డికి ప్రమే యం ఉందనే ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆయన హైదరాబాద్‌లో మార్నింగ్‌ వాక్‌ చేస్తుండగా అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page