జర్నలిస్టు నముండ్ల శ్రీనివాస్ ను ఓదార్చిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని ప్రాంతానికి చెందిన ప్రజాలక్ష్యం తెలుగు దినపత్రిక రిపోర్టర్ నముండ్ల శ్రీనివాస్ ను మాజీ రామగుండం ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బి ఆర్ఎస్ అధ్యక్షులు కోరుకంటి చందర్ శనివారం పరామర్శించారు. శ్రీనివాస్ తల్లి నముండ్ల రాజమ్మ అనారోగ్యంతో జనవరి 11న పరమపదించినారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చందర్ శ్రీనివాస్ స్వగ్రామం సుల్తానాబాద్ మండలంలోని అల్లిపూర్ (రేగడి మద్దికుంట) గ్రామంలోని అతని నివాసం లో కలిసి ఓదార్చారు.ఈ సందర్బంగా చందర్ మాట్లాడుతూ శ్రీనివాస్ తల్లి రాజమ్మ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నానని అన్నారు. శ్రీనివాస్ తల్లి రాజమ్మ మరణించడం తీరని లోటు అని ఆయన అన్నారు.కాగా శ్రీనివాస్ తో పాటు అతడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని చందర్ వ్యక్తపరిచారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App