కరకుదురు గ్రామ ప్రజల చిరకాల వాంఛ, నెరవేర్చనా,మాజీ ఎమ్మెల్యే, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి.
తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గం పెదపూడి: త్రినేత్రం న్యూస్
అనపర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులను, గ్రామ ప్రజలకు గౌర సత్కారం.
అనపర్తి నియోజకవర్గం, పెదపూడి మండలం, కరకుదురు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో మంగళవారం జరిగిన లక్ష పత్రి పూజ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ, మాజీ శాసన సభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరకుదురు గ్రామ ప్రజల చిరకాల వాంఛ దేవతా కళ్యాణమండపం నిర్మాణము, ముఖమండప నిర్మాణాల కొరకు అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ నుంచి నిధులు సుమారు రూ. 50లక్షలు మంజూరు చేయించగా నిర్మించిన మండపాలను దంపతులు పరిశీలించారు.
కరకుదురు గ్రామ ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి కళ్యాణ మండపం శిథిల అవస్థలో ఉన్న ముఖ మండపం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు గత ప్రభుత్వాలలో శాసనసభ్యులను అనేకసార్లు కోరగా ఫలితం లేదు. చివరకు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో, అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఈ నిధులు మంజూరు చేయించారు. కళ్యాణ మండపం ముఖ మండపం పూర్తి కావడంతో ఈరోజు అనగా మంగళవారం ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి పూజ స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన మాజీ శాసన సభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులు ఘనంగా మాజీ ఎమ్మెల్యే దంపతులను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో యేండ్రు సతీపార్వతి,వెంకట సుబ్బారావు, గ్రామ సర్పంచ్ వుండ్రు చంద్రకళ,సత్యన్నారాయణ, వల్లూరి పట్టాభి, చుండ్రు వీరవెంకట సత్యనారాయణ, మేక సత్యనారాయణ, మేక రామకృష్ణ, వాసంశెట్టి మాధవ కార్నిది వీరబాబు, పాఠంశెట్టి త్రిమూర్తులు, పాఠంశెట్టి రామన్న, ముప్పిడి సత్యన్నారాయణ, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీమతి అడబాల నూక రత్నం, శ్రీమతి వనం కనకదుర్గ, మందపల్లి బుల్లి రాజు, చేటకాల వరప్రసాద్, శ్రీమతి కొండయ్య పాలపు రమణ, శ్రీమతి అడబాల బుజ్జి, ఎరుబండి రమణ, యార్లగడ్డ భాస్కర రావు, నందిగం నాగేశ్వర రావు అడబాల సత్యనారాయణ, సాన సూర్యనారాయణ, పాపం శెట్టి ఫకీర్ తదితరులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App