నల్లమిల్లి – లింగాల చెరువుల్లో మట్టి మాఫియా పై అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి పోరాటం – అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందచేత
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గంలోని నల్లమిల్లి గ్రామంలో జగన్నాధ సాగరం చెరువు, అలాగే బిక్కవోలు మండలంలోని బిక్కవోలు గ్రామంలో ఉన్న లింగాల చెరువులో భారీ స్థాయిలో జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలు గురించి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, వెలుగులోకి తీసుకువచ్చారు. స్థానిక శాసనసభ్యుడి అక్రమ సంపాదన కోసం జరుగుతున్న ఈ మట్టి దోపిడి ప్రజల ఆస్తిపై సాగుతున్న దాడిగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, తీవ్రంగా స్పందించారు.
ఈ అక్రమ తవ్వకాలపై జిల్లా కలెక్టర్ గారిని కలిసి అధికారికంగా ఫిర్యాదు చేసిన డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు, మైనింగ్ అండ్ జియాలజీ విభాగానికి, అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ శాఖలకు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.ప్రజల ఆస్తిని దోచుకు తింటున్న స్థానిక బీజేపీ శాసనసభ్యుడు సొల్లు రామకృష్ణారెడ్డి; అక్రమ సంపాదన కోసం వ్యవస్థలను మోసం చేస్తున్న తీరును ఆయన గట్టిగా తప్పుబట్టారు.
వారిని అడ్డుకునేందుకు తక్షణమే విచారణ జరిపించి, మట్టి దోపిడిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై కఠినమైన శిక్షలు విధించాలని, వారు దోచుకున్న ప్రజల సొమ్మును తిరిగి ప్రభుత్వ ఖజానాకు చెల్లింపుచేయించాలిన డిమాండ్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


