Former Minister Koppula of BRS Party, a party formed for the achievement of Telangana state
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తెలంగాణ లో 24 గంటల కరెంటు వాడినం అంటే తెలంగాణ ఉద్యమ విజయం మాజీ మంత్రి కొప్పుల
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ధి కాలం గడుస్తున్న సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
ఇందులో భాగంగా జూన్1, జూన్2, జూన్3 తేదీల్లో మూడు రోజులపాటు బిఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించాని జిల్లా పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ తో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు
రామగుండం లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి కొప్పుల మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలుగా శాంతియుతంగా పోరాటం జరిగిందో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు పాల్గొని అనేక ఘట్టాలు దాటి ఆనాటి పరిస్థితులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమ ప్రస్థానమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
నీళ్ళు నిధులు నియామకం పై జరిగిన ఉద్యమం తెలంగాణ ఉద్యమం..అనేక అపవాదులు, అవమానాలు గురైన, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే తప్పా ఈ ప్రాంతానికి విముక్తి లేదు, అభివృద్ధి సాధించదు అని కెసిఆర్ పట్టుదలతో పట్టింపు తో తెలంగాణ నినాదాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడారు
తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవిర్భావం జరగబోతే ఈనాడు జరిగిన తెలంగాణ రాష్ట్రం లో ఉండేదో లేదో గుర్తు చేసుకోవచ్చు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకా పోతే కాళేశ్వరం లాంటి బహుళార్థక నిర్మాణం జరిగేది కాదు
తెలంగాణ లో 24 గంటల కరెంటు వాడినం అంటే తెలంగాణ ఉద్యమ విజయం
రైతాంగం మూడు కోట్ల 20 లక్షల మెట్రిక్ టన్నులు దాన్యం పండించమంటే తెలంగాణ ఉద్యమ విషయం
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ధి కాలం గడుస్తున్న సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ధి కాలం గడుస్తున్న సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు
జూన్ 1.వ తేదీ నాడు గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి ట్యాంక్ బండ్ వద్దగల అమర జ్యోతి వరకు సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ పాల్గొనడం జరుగుతుంది,
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు త్యాగం చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించి ఘననివాళి అర్పిస్తారు
తెలంగాణ ఆవిర్భావ రోజు జూన్ 2 తేదీన తెలంగాణ ఆవిర్భావం మై దశాబ్ది కాలం గడుస్తున్న నేపధ్యంలో దశాబ్ది ముగింపు వేడుకల సభ ను హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు, ఇదే రోజు హైదరాబాద్ లో పలు దవాఖానాలలో అనాథ శరణాలయాలలో, పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తారు
జూన్ 3.వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ముగింపు వేడుకలు నిర్వహించి,
ఈ సందర్భంగా పార్టీ జెండాను మరియు జాతీయ జెండాను ఎగరవేస్తారు. స్వీట్లు పండ్లు పంపిణీ చేస్తారు
ఈ చారిత్రక సందర్భంలో దశాబ్ది ముగింపు వేడులను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కార్యకర్తలు, పార్టీ అందించే సూచనలను అనుసరించి ముగింపు వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు నేతలను కోరినారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App