జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 30 at 7.11.07 PM

TRINETHRAM NEWS

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డి.ఎస్.పి.

హైదరాబాద్ డిసెంబర్ 30:తెలంగాణ మాజీ డీఎస్పీ నళిని శనివారం డా.బిఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసారు.

తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికా రులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు.

తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని సూచించారు.

అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులకు తెలిపారు ఈ నేపథ్యంలోనే నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.

You cannot copy content of this page